రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాకు చెందిన ముగ్గురు మహిళా ఉపాధ్యాయుల ఎంపిక




నీరజ, అరుణకుమారి, విజయభారతి
నీరజ, అరుణకుమారి, విజయభారతి

ఈసారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.

ఎంపికైన ఉపాధ్యాయులు:

  • తిమ్మరాజు నీరజ – శ్రీకాకుళం అంధవరపు వరం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో హిందీ పండితురాలు.

  • కురమాన అరుణకుమారి – జి.సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు.

  • బూరవల్లి విజయభారతి – మెళియాపుట్టి మండలం నేలబొంతు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు.

తిమ్మరాజు నీరజ

2002 డీఎస్సీ ద్వారా ప్రియాగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. అనంతరం 2007లో టీపీఎం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్‌ బదిలీలలో భాగంగా అంధవరపు వరం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు.

బూరవల్లి విజయభారతి

2021లో సైన్స్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. 9వ తరగతి భౌతికశాస్త్ర పాఠ్యపుస్తకంలో అనేక పాఠ్యాంశాలు రచించారు. ఉపాధ్యాయుల శిక్షణ కోసం అవసరమైన పాఠ్యసామగ్రి కూడా రూపొందించారు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శిక్షణ పొందారు. ఆమె తండ్రి బూరవల్లి త్రినాథరావు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. భర్త వెంకటేశ్వరరావు విశాఖలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా సేవలందిస్తున్నారు.

కురమాన అరుణకుమారి

బూటుపేట ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆమెకు ఎంఈవోలు అరసాడ రవి, మొండి శ్రీనివాసరావు, సహ ఉపాధ్యాయులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment