శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్ల జయరాం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయ్డును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం బూర్జ మండలం పరిస్థితులను వివరించారు. సానుకూలంగా స్పందించి, ఎంపీ లాడ్స్ నుండి బూర్జ మండలానికి అవసరమైన నిధులు కేటాయిస్తానని భరోసా ఇవ్వడంతో పాటు నీలాంటి యువకులు సమకాలీన రాజకీయాలకు అవసరమని అనడంతో ప్రాంగణమంతా కేరింతలతో మార్మోగింది.
