రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం – కింతలి సాయిప్రియకు ఘన విజయం
గుజరాతీపేట (శ్రీకాకుళం), న్యూస్‌టుడే:
శ్రీకాకుళం నగరంలోని బలగ ప్రాంతానికి చెందిన కింతలి సాయిప్రియ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన పీజీ ఫలితాల్లో మెరిసింది. రాజమహేంద్రవరంలోని ఓ ప్రముఖ వైద్య కళాశాలలో రేడియాలజీ విభాగంలో పీజీ చేసిన ఆమె, రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంను సాధించి తన ప్రతిభను మరోసారి చాటిచెప్పింది.
సాయిప్రియ తండ్రి కింతలి కాళిదాసు హోమియో వైద్యుడిగా, తల్లి గొండు వెంకటలక్ష్మి ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారు. తమ కుమార్తె సాధించిన ఘన విజయంలో వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సాయిప్రియ మాట్లాడుతూ —
"రేడియాలజీ ప్రొఫెసర్‌గా స్థిరపడటం నా లక్ష్యం. ఈ విజయంతో మరో అడుగు ముందుకు వేసినట్టు భావిస్తున్నాను," అని పేర్కొన్నారు.
ఆమె విజయానికి పలువురు బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచే విద్యార్థిగా సాయిప్రియ ఎదిగిన విధానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
