శ్రీకాకుళం యువకుడికి శబరిమల ఆలయం నుంచి ప్రత్యేక లాకెట్‌

 





గుజరాతీపేట (శ్రీకాకుళం), న్యూస్‌టుడే:
కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) విషు పండుగ సందర్భంగా ప్రత్యేక బంగారు లాకెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక అమ్మకాల్లో తొలి లాకెట్‌ను శ్రీకాకుళం నగరానికి చెందిన కె. మణిరత్నం ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయడం విశేషం.

ఈ సందర్భంగా కేరళ దేవాదాయ శాఖ మంత్రి వి.ఎన్. వాసవన్ సోమవారం మణిరత్నానికి ఆ లాకెట్‌ను అందజేశారు. నాలుగు గ్రాముల బరువుతో తయారైన ఈ లాకెట్‌ ధర రూ.38,600. శబరిమల ఆలయ గర్భగుడిలో పూజించి, దర్శనార్థులకు అందించిన తొలి లాకెట్‌ ఇదే కావడం విశేషం.

ఈ సందర్భంలో మణిరత్నం తండ్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఆరోగ్య విస్తరణాధికారిగా పనిచేస్తున్న కొబగాపు నారాయణరావు మాట్లాడుతూ –

“శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలందుకున్న తొలి లాకెట్‌ను మా కుమారుడు పొందడం ఆనందంగా ఉంది,” అని హర్షం వ్యక్తం చేశారు.

అయ్యప్ప భక్తులకు ఇది గర్వకారణంగా మారింది.

Post a Comment