బూర్జ మండలం నీలంపేట గ్రామంలో వెలసియున్న నీలవేణి అమ్మవారికి ప్రతిఏటా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తుంటారు.అందులో భాగంగా ఈ ఏడాది నిర్వహిస్తున్న జాతరకు నిర్వాహకుల ఆహ్వానం మేరకు సాంప్రదాయ పద్ధతిలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్ల జయరాం హాజరై అమ్మవారిని దర్శించుకొని తల్లి ఆశీస్సులు పొందారు. అనంతరం కొల్ల మాట్లాడుతూ మనిషి మనుగడ ఆధ్యాత్మికతతోనే సాధ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవరుచుకోవాలని,తద్వారా సనాతన ధర్మం పరిఢవిల్లుతుందని తెలిపారు. ప్రతి హిందువు సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్ల జయరాం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పైడి మల్లేశ్వరరావు,పల్లె తవిటినాయ్డు,రాంబాబు, అప్పలరాజు,మజ్జి రాంబాబు,మౌళి,మన్మధరావు, కేత సాయితో పాటు జనసైనికులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
