నెల ఆఖరు వరకు 50 శాతం వడ్డీ రాయితీ

 

నెల ఆఖరు వరకు 50 శాతం వడ్డీ రాయితీ

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే:

శ్రీకాకుళం నగరపాలక సంస్థ, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం పురపాలక సంఘాల పరిధిలో ఉన్న ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతేడాది మార్చి నెలాఖరు వరకూ పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నులను ఈ నెలాఖరులోగా పూర్తిగా చెల్లించినవారికి వడ్డీపై 50 శాతం రాయితీ అందిస్తామని గురువారం అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి.

గత నెల 25న ఈ రాయితీ ప్రకటించగా, చివరి ఐదు రోజులలో నగరవాసులు భారీగా స్పందించి వడ్డీ మినహాయింపు లబ్ధిని పొందారు. ఈ విజ్ఞజం దృష్ట్యా ప్రభుత్వం రాయితీ కాలాన్ని మరో 20 రోజులు పొడిగించింది.

ఇక ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఉన్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నును కూడా ఒకేసారి నెలాఖరులోగా చెల్లించినవారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాదరావు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సమయానికి పన్నులు చెల్లించాలని ఆయన సూచించారు.

Post a Comment