25 వ ప్రయత్నం లో వరించిన విజయం

 



కంచిలి, న్యూస్‌టుడే:

తలతంపర గ్రామానికి చెందిన నడిపూరి రామకృష్ణ, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు నడిపూరి శివాజీ తన అసాధారణ పట్టుదలతో విజయాన్ని సాధించాడు. 24 సార్లు పరీక్షలు రాసినా అసఫలమవుతూ, 25వ ప్రయత్నంలో యూనియన్‌ బ్యాంక్‌ పీవోగా ఎంపికయ్యాడు.

పేద కుటుంబానికి చెందిన శివాజీ, 2019లో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. బ్యాంకింగ్‌ రంగమే తన లక్ష్యంగా విజయవాడలోని ఓ శిక్షణ కేంద్రంలో చేరి సాధన ప్రారంభించాడు. శిక్షణ అనంతరం స్వగ్రామానికి చేరుకుని, ఆన్‌లైన్‌ ద్వారా సాధన కొనసాగించాడు. అనేక విఫలతలు ఎదురైనా, నైతిక ధైర్యం కోల్పోకుండా కృషిచేసి, చివరకు విజయాన్ని అందుకున్నాడు.

యూనియన్‌ బ్యాంక్‌ నిర్వహించిన తాజా పరీక్షల్లో పీవోగా ఎంపికవడం, అతని పట్టుదలకు నిదర్శనం. కేంద్ర నిర్వాహకుల సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అతనికి బలాన్నిచ్చాయి.

Post a Comment